పెసర రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. రైతు సంఘం డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నెలాకొండపల్లి మండలంలో ఆరుతడి పంటల సాగుతో నష్టపోతున్న పెసర రైతులను వెంటనే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. పెసలకు కనీస మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పెసలకు క్వింటాల్‌కు రూ.8,768 మద్దతు ధర ఉండగా, బహిరంగ మార్కెట్లో దళారులు కేవలం రూ.5,500కే కొనుగోలు చేస్తున్నారని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు పాల్తియా శ్రీనివాసరావు తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని కోరారు.