నిమ్స్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ నివాసాలపై ఏసీబీ దాడులు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ఎన్. లక్ష్మీ భాస్కర్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు జరిపి రూ. 6.13 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. ఎనిమిది అపార్ట్మెంట్లు, ఖాళీ స్థలాలు, బంగారు ఆభరణాలు, పెట్టుబడులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.