అభివృద్ధి, సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

రిపోర్టర్: రాము స్థలం: సిద్దిపేట

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులు మరియు సంక్షేమం తదితర రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి విభాగాన్ని బలోపేతం చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.