ఇస్రో ప్రైవేటీకరణ జరగదు: చైర్మన్ నారాయణన్ సంచలన ప్రకటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: India

ఇస్రో ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తెరదంచారు. సంస్థను ప్రైవేట్‌పరం చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఇకపై కూడా ఇస్రో ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుందని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. రాకెట్లు, శాటిలైట్ల తయారీని పరిశ్రమలకు అప్పగిస్తున్నప్పటికీ, ఇది ప్రైవేటీకరణ కాదని, భవిష్యత్ అంతరిక్ష మిషన్లపైనే సంస్థ ప్రధానంగా దృష్టి పెడుతుందని తేల్చిచెప్పారు.