పరీక్షల పేపర్ల లీకేజీకి చెక్: ఏఐ వినియోగంపై నందన్ నీలేకని కీలక సూచన
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో పరీక్షల పేపర్ల లీకేజీలను పూర్తిగా అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని సూచించారు. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, పరీక్ష రోజునే ఏఐ ద్వారా కొత్త ప్రశ్నపత్రాలను రూపొందించాలని ప్రతిపాదించారు. దీనివల్ల లీకేజీల ముప్పు తొలగిపోతుందని, తద్వారా విద్యా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్కరణల అమలుకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని నందన్ నీలేకని వెల్లడించారు.