ఇరాన్ పై దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని ఒత్తిడి: డొనాల్డ్ ట్రంప్ వైముఖ్యం

రిపోర్టర్: రాజేష్ స్థలం: టెల్ అవీవ్

అమెరికా మధ్యకాలిక ఎన్నికల తర్వాత ఇరాన్ పై వెంటనే సరికొత్త సైనిక దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి తెస్తున్నట్లు ఆక్సియస్ మీడియా కథనం వెల్లడించింది. అయితే ఇరాన్ తో దౌత్యపరమైన చర్చలను కొనసాగించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సంభాషణ ఇజ్రాయెల్ వర్గాల ద్వారా బయటపడటంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భేదాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.