పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష
రిపోర్టర్: సునీల్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోక్సో కేసులో విచారణ పూర్తికాగా, న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 190/2021 కేసులో నిందితుడైన తలారి జగదీశ్ దోషిగా తేలినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు అతడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు అయిదు వేల రూపాయల జరిమానా విధిస్తూ సంగారెడ్డిలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు.