సూరసముద్రం చెరువు శుభ్రత.. చెత్త వేస్తే రూ.50 వేల జరిమానా!

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని సూరసముద్రం చెరువు సమీపంలో వ్యర్థాలు వేస్తున్నట్లు వచ్చిన వార్తలపై చైర్మన్ ఎన్. పత్య నాయక్, కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఈరోజు పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి చెరువు గట్టు వద్ద శుభ్రపరిచే కార్యక్రమాలను స్వయంగా ప్రారంభించారు.

చెరువుల్లో వ్యర్థాలను వేస్తే రూ. 50 వేల వరకు భారీ జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిల్ ద్వారా చెరువును సుందరీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రమేష్, వెంకటయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.