రాజకీయ ముసుగులో నేరాలను సహించవద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: మంగళగిరి
దేశ రక్షణకు భంగం కలిగే చర్యలను పోలీసు వ్యవస్థ అడ్డుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారికి ఎటువంటి రక్షణ కల్పించకూడదని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను వేధిస్తున్న సైకోలను వదిలిపెట్టవద్దని ఘాటుగా హెచ్చరించారు.