మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: ఒక్క ఓటు మెజారిటీతో అభ్యర్థుల సంచలన విజయం
రిపోర్టర్: సునీల్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా తుని మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో ఆసక్తికర ఫలితం వెలువడిందని అధికారులు తెలిపారు. ఇరవై రెండవ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఇళ్ల దర్గాదేవి కేవలం ఒక్క ఓటు మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కూత్తు పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేవలం ఒకే వార్డు దక్కగా, దానిలోనూ ఆమె గెలుపొందడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.