విజయనగరం ఎన్నికలు: డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ మరియు ఎస్పీ

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మరియు ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం రాజీవ్ స్టేడియంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను ఉద్యోగులందరూ ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు.