శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీశైలం
తెలుగు రాష్ట్రాల జలప్రదాయిని శ్రీశైలం ప్రాజెక్టుకు లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలో అరుదైన స్థానం లభించిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఈ రికార్డు దక్కించుకున్న తొలి నీటిపారుదల ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఏపీ జెన్కో అతిథి గృహంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ సౌత్ జోన్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్ ఈ ప్రతిష్టాత్మక ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు అందజేశారు.