గురువాయూర్ శ్రీ బాలకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

రిపోర్టర్: విజయ్ స్థలం: కేరళ

కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిస్సూర్ గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి స్వామివారిని పూజించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.