ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాపై రెండుసార్లు అమెరికా దాడులు

రిపోర్టర్: సునీల్ స్థలం: టెహ్రాన్

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబాపై అమెరికా రెండుసార్లు దాడులు జరిపినట్లు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సభ్యుడు మొహ్సెన్ హెయ్దరీ వెల్లడించారు. ఖతార్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలు తెలిపారు. సమావేశమైన భవనంపై, ఆ తర్వాత ఆస్పత్రిపై దాడులు జరిగినా ప్రాణాలతో బయటపడిన మొజ్తాబాను ఇరాన్ నూతన నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.