విజయనగరం జిల్లాలో పెరుగుతున్న మలేరియా డెంగీ కేసులు

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో పారిశుద్ధ్య లోపం మరియు దోమల నివారణ చర్యలు విఫలమవడంతో మలేరియా, డెంగీ కేసులు పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 655 మలేరియా బాధితులు, 59 డెంగీ బాధితులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో దోమల నియంత్రణకు లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఫాగింగ్, స్ప్రేయింగ్ జాడ లేకపోవడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.