స్టార్టప్‌లు భవిష్యత్తులో పెద్ద కార్పొరేట్‌లుగా మారాలని నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
స్టార్టప్‌ల సంఖ్యను పెంచడం కంటే అవి నిలదొక్కుకోవడం చాలా ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఐమా 53వ జాతీయ మేనేజ్‌మెంట్ కన్వెన్షన్‌లో ఆమె మాట్లాడుతూ, నేటి స్టార్టప్‌లు భవిష్యత్తులో ప్రధాన కార్పొరేట్ సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశంలో వ్యాపార వాతావరణం పటిష్టంగా ఉందని తెలిపారు.