ఖమ్మం ప్రెస్ క్లబ్ పగ్గాలు చేపట్టిన నూతన నాయకులు

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ ప్రాంతంలో టీజేఏ ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎం.డి. రషీద్, ప్రధాన కార్యదర్శిగా ఎం. చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించి, స్వీట్లు తినిపించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా అధ్యక్షులు జి. నాగస్వామి, గౌరవ అధ్యక్షులు మణికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సయ్యద్ ఖాసిం తదితర ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.