రోడ్లు లేక డోలీ మోతలతో రోదిస్తున్న అడవితల్లి ఆక్రోశం

రిపోర్టర్: అశోక్ స్థలం: కొత్తగూడెం

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ సుజాతనగర్ మండలం గొల్లగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు దశాబ్దన్నర కాలంగా దారి లేక నరకయాతన అనుభవిస్తున్నారు. పాఠశాలకు స్థలం ఇస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన స్థల యజమాని వీర్ల వెంకటేశ్వర్లు మాట తప్పడంతో పదిహేనేళ్లుగా విద్యార్థులు పంట పొలాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. మంచి విద్యా ఫలితాలు సాధిస్తున్నప్పటికీ దారి సమస్య కారణంగా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని ప్రజలు కోరుతున్నారు.