కుమారుడి ఆత్మహత్యపై స్పందించిన రిక్కీ హాటన్ తల్లిదండ్రులు
రిపోర్టర్: గోపి
స్థలం: World
దివంగత బాక్సింగ్ ఛాంపియన్ రిక్కీ హాటన్ ఆత్మహత్యకు మూడు రోజుల ముందు తన కుమారుడిని కలిశానని ఆయన తల్లి కరోల్ హాటన్ తెలిపారు. మృతిచెందడానికి ముందు కొడుకుతో జరిగిన ఆఖరి ఆలింగనాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. రిక్కీ తల్లిదండ్రులు మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తమ భావోద్వేగాలను పంచుకుంటూ, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను వ్యక్తపరచాలని పిలుపునిచ్చారు. మాంచెస్టర్‌లో రిక్కీ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.