రూ. పదిహేడున్నర కోట్లతో ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ పట్టణంలో రూ. 17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ నాణ్యతను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.