ఏషియన్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన సత్నామ్, సల్మాన్
రిపోర్టర్: మహేష్
స్థలం: గిఫు
జపాన్ లోని గిఫు వేదికగా జరుగుతున్న ఏషియన్ క్రీడల్లో భారత రోవర్లు సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ పురుషుల డబుల్ స్కల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి దేశం గర్వపడేలా చేశారు. అయితే రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చివరి నిమిషంలో చేసిన మార్పుల వల్ల తాము తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని, సరిగ్గా నిద్ర కూడాపోలేదని పతక విజేత సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా దేశం కోసం పతకం తేవడమే ముఖ్యమన్న ఉద్దేశంతో బరిలోకి దిగామని ఆయన స్పష్టం చేశారు.