గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పలు గణేశ్ మండపాలను సర్పంచ్ తంగల వెంకటేశం, ఉపసర్పంచ్ సురుకంటి శ్రీధర్‌రెడ్డి సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.