ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ రామగుండం కార్పొరేషన్‌పై ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలో లక్షల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన పారిశుద్ధ్య యంత్రాలు, వాహనాలు నిరుపయోగంగా పడి ఉండటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులు మండిపడ్డారు. రూ.65 లక్షల స్వీపింగ్ మిషన్, గార్బేజ్ కంపాక్టర్లు మూలకు చేరడంపై విమర్శలు గుప్పించారు. సాంకేతిక లోపాలను సరిచేయాలని, నిరుపయోగంగా ఉన్న యంత్రాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు.