మహిళల్ లో పీసీఓఎస్ సమస్య: లక్షణాలు మరియు నివారణ మార్గాలపై నిపుణుల హెచ్చరిక

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

మహిళల్ లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల పీసీఓఎస్ సమస్య తలెత్తుతుందని పోషకాహార నిపుణులు వెల్లడించారు. ఇది కేవలం నెలసరి క్రమం తప్పడానికే పరిమితం కాకుండా మొటిమలు, అవాంఛిత రోమాలు, జుట్టు రాలడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఇన్సులిన్ నిరోధకత మరియు ఆండ్రోజెన్ హార్మోన్ల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని తెలిపారు. శరీరంలో కనిపించే మార్పులను గమనిస్తూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని నిపుణులు స్పష్టం చేశారు.