మర్రిపాడులో విద్యార్థులకు మండల స్థాయి పోటీల ఘన నిర్వహణ
రిపోర్టర్: Darsigunta Naveen
స్థలం: మర్రిపాడు
మర్రిపాడు ఉన్నత పాఠశాలలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. విజేతలు అక్టోబర్ 1న నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈఓ-2 ధనలక్ష్మి తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకతను, దేశాభివృద్ధిపై అవగాహనను పెంపొందించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.