అవయవదానం ద్వారా ఐదుగురికి ప్రాణం పోసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్ బ్రెయిన్ ట్యూమర్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవదానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఈ నెల 16న ఇంట్లో కింద పడిపోయిన వినయ్‌ను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.