ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Tirupati
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ అనారోగ్యంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లంలోని ఏకం ఆలయానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సందర్శనార్థం ఉంచే ఈ పార్థివదేహానికి శనివారం ఆలయ ప్రాంగణంలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. దేశవిదేశాలలో లక్షలాది మంది భక్తులను సంపాదించుకున్న కల్కి భగవాన్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.