భక్తిశ్రద్ధలతో వినాయక మండపాలను దర్శించుకున్న కూటమి నేతలు

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని గణనాధుని దివ్య దీవెనలు అందుకున్నారు.