దిల్లీలో బాలికపై అత్యాచారం, హత్యపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

దిల్లీలో దారుణంగా హత్యకు గురైన బాలిక ఉదంతంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యం వల్లే రాజధానిలో మహిళలకు రక్షణ కరవైందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దిల్లీ పోలీసుల పనితీరును తప్పుబట్టిన ఆయన, నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే సాధారణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే పోలీసుల పనా అని నిలదీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.