మోడలింగ్ పేరుతో మోసాలకు పాల్పడిన మహిళకు జైలు శిక్ష

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: మిషిగన్

అమెరికాలోని మిషిగన్కు చెందిన చానీస్ కాయిన్ అనే 46 ఏళ్ల మహిళ పిల్లల మోడలింగ్ పేరుతో ఓ స్థానిక కుటుంబం నుంచి 4.6 మిలియన్ డాలర్లకు పైగా టోకరా వేసింది. ఈ మోసానికి పాల్పడిన ఆమెకు ఫెడరల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. నకిలీ సందేశాలు, ఇన్వాయిస్లు సృష్టించి మోసానికి పాల్పడినట్లు తేలడంతో ఆమె మే 19న నేరాన్ని అంగీకరించింది.