మనుబోలులో కూటమి జెండా ఎగరేసేందుకు బీజేపీ శ్రేణులు కదంతొక్కాలన్న రామిరెడ్డి
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలో పదకొండు ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జెడ్పీటీసి స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.