గన్నవరం విమానాశ్రయంలో ఆర్చర్ జ్యోతి సురేఖకు ఘన స్వాగతం
రిపోర్టర్: సునీల్
స్థలం: Vijayawada
ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి స్వర్ణం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని విజయవాడకు చెందిన ప్రముఖ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తెలిపారు. ఆసియా క్రీడలు ముగియడంతో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. వచ్చే ఒలింపిక్స్లో పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సహకారంతోనే తాను ఈ అద్భుత విజయాలను సాధించగలిగానని ఆమె వెల్లడించారు.