విజయవాడలో ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ పేరుతో మహిళా బైకర్ల ర్యాలీ

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయవాడ

విజయవాడ నోవోటెల్ హోటల్ నుంచి మంగళగిరి ఏసీఏ స్టేడియం వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద మంది మహిళా బైకర్లతో ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కల్యాణ్ కృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. డబ్ల్యూఏపీఎల్ ప్రచారం నిమిత్తం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ తదితరులు పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు.