కళా ప్రస్థాన వేడుకకు తరలిరావాలని మాజీ ఎమ్మెల్యేకు విమలక్క పిలుపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో ఈనెల 26 నుంచి 28 వరకు జరగనున్న 50 ఏళ్ల విమలక్క కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 50 గంటల ప్రజా కళా జాతరకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డిని విమలక్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, మాజీ ఎంపీటీసీ కట్ట వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ మురళీమోహన్ అప్పి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కోకన్వీనర్ జంగయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.