ఏపీపీఎస్సీ గ్రూప్-1 సహా 892 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో 892 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 163 గ్రూప్-1 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 6 నుంచి 27 వరకు గ్రూప్-1 దరఖాస్తులు స్వీకరిస్తారు. మిగిలిన 729 పోస్టులకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.