ఎస్ఎస్సీ సిజిఎల్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఎస్ఎస్సీ సీజీఎల్-2026 టైర్-1, టైర్-2 పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు పరీక్షా సరళిని గమనించి సన్నద్ధం కావాలని సూచించింది.