సిరిసిల్ల గడీల మీద గురిపెడదామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్

రిపోర్టర్: సురేష్ స్థలం: राजన్న సిరిసిల్ల

సిరిసిల్ల గడీల మీద గురిపెడదామని, ఫిరంగులమై పేలుదామని కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పాలనపై, మాజీ మంత్రి కేటీఆర్పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2009 నుంచి కేటీఆర్ను గెలిపిస్తున్నా నేతన్నల ఆత్మహత్యలను, కార్మికుల వలసలను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని ఆరోపించారు.