పార్టీ ఫిరాయింపులపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాకన్న కేసీఆర్

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు రేవంత్ సర్కార్కు దిమ్మతిరిగే షాకని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ కొట్టివేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రావడం ఖాయమని, అక్కడ గులాబీ జెండా ఎగరడం తథ్యమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.