రాష్ట్రంలో భారీగా తగ్గిన ఉపాధి హామీ పనిదినాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గ్రామీణ ఉపాధి పనులకు భారీగా గండిపడిందని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అధికారికంగా వెల్లడించింది. 2024-25 సంవత్సరంలో 1,222.87 లక్షల పనిదినాలు కల్పించగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 731.63 లక్షలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య తగ్గడంతో పాటు జాబ్ కార్డుల కోత, యాప్ ఆధారిత హాజరులో సాంకేతిక సమస్యలు గ్రామీణ కూలీల బతుకులను మరింత భారంగా మారుస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.