టీసీఎస్కు అమెరికా గ్రీన్ కార్డ్ షాక్: పదిహేను వేల నియామకాలు చేపడతామని వెల్లడి

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై తాజా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక ప్రకటన చేసింది. అమెరికాలో కొత్త నిబంధనల వల్ల తమపై ఎలాంటి ప్రభావం ఉండదని, రానున్న ఐదేళ్లలో పదిహేను వేల మంది స్థానిక ఉద్యోగులను నియమించనున్నట్లు టీసీఎస్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియలో ఎదురైన పరిణామాలపై స్పందిస్తూ, తమ వ్యాపార వ్యూహానికి ఎటువంటి ఇబ్బంది కలగబోదని స్పష్టం చేశారు.