పలాసలో కూలబడిన గంజాయి అక్రమ రవాణా ఉచ్చు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ కాలనీ మూడో లైనులో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ సీఐ జి.రామకృష్ణ గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి 18.415 కిలోల గంజాయితో పాటు 2 సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.