ఆప్ పార్టీకి భారీ షాక్ తగిలిందంటూ విరాళాలు పడిపోయాయన్న నివేదిక

రిపోర్టర్: భాస్కర్ స్థలం: New Delhi

ఆప్ పార్టీకి వచ్చిన విరాళాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 68 శాతం మేర పడిపోయాయని ఎన్నికల సంఘానికి పార్టీ సమర్పించిన నివేదిక వెల్లడించిందని అధికారులు తెలిపారు. ఆ ఏడాదిలో ఆప్ కేవలం రూ. 12.10 కోట్ల విరాళాలు మాత్రమే అందుకున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా ట్రైడెంట్ లిమిటెడ్, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ చెరో రూ. 5 కోట్లు విరాళంగా అందించినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆ రిపోర్ట్ లో పేర్కొన్నారు.