పాలకొండ వీరఘట్టం రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటితో నిలిచిన రాకపోకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలకొండ నుంచి వీరఘట్టం వెళ్లే రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.