నెల్లిమర్లలో ఘనంగా జనసేన 'జై కొట్టు' యువజన విభాగం లోగో ఆవిష్కరణ
రిపోర్టర్: రాము
స్థలం: Nellimarla
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన 'జై కొట్టు' యువజన విభాగం లోగోను లోకం నాగ మాధవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో జనసేన శ్రేణులు సందడి చేశారు. యువతను రాజకీయాల్లో చైతన్యవంతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.