నేదురూపల్లిలో ఘనంగా నేషనల్ పోషణ మాసోత్సవ వేడుకలు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని నేదురూపల్లి అంగన్వాడీ కేంద్రంలో తొమ్మిదో జాతీయ పోషణ మాసోత్సవం, అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో విజయలక్ష్మి మాట్లాడుతూ శిశువు పుట్టినప్పటి నుంచి ఆరేళ్ల వయస్సు వరకు పిల్లల ఎత్తు, బరువును గ్రోత్ చార్ట్ ద్వారా పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో గర్భిణులకు శ్రీమంతాలు నిర్వహించి, తల్లులను సన్మానించడంతో పాటు ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.