అసంపూర్తి కాలువ పనులతో నిలిచిపోయిన మురుగు నీరు
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
అచ్యుతాపురం అసంపూర్తిగా మిగిలిన మురుగుకాలువ పనులతో అచ్యుతాపురం–గాజువాక ప్రధాన రహదారిపై మురుగునీరు నిలిచిపోతోంది. మోసయ్యపేట నుంచి వచ్చే మురుగుతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నీరు సమీప తాగునీటి బావుల్లోకి చేరడంతో అవి కలుషితమై నురగలు కక్కుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. వెంటనే కాలువ పనులు పూర్తిచేసి, మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.