తాగునీటి సమస్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

జలమండలి పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులను తాత్కాలికంగా పరిష్కరించకుండా మూల కారణాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. రాబోయే నాలుగు నెలల్లో ఆదాయాన్ని 20 శాతం పెంచే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.