ఫ్యాషన్ ప్రపంచంలో కలకలం: మెటాలిక్ గ్రే చీరలో రాణి ముఖర్జీ లుక్

రిపోర్టర్: హరి స్థలం: ముంబై

ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ సవ్యసాచి దీపావళి రిసెప్షన్లో మెటాలిక్ గ్రే రంగు చీర ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ఫ్యాషన్ నిపుణులు వెల్లడించారు. ఎప్పుడూ ధరించే సాంప్రదాయ రంగులకు భిన్నంగా లిక్విడ్ గ్రే సాటిన్ డ్రేప్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన నల్లటి స్క్వేర్ గ్లాసెస్, స్టైలిష్ యాక్సెసరీస్తో ఆమె ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్ను సృష్టించారని, ఈ సరికొత్త శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలిపారు.