చెరువులో కారుతో మద్యం తాగి చిక్కుకున్న యువకులు
రిపోర్టర్: అశోక్
స్థలం: తమిళనాడు
తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని కుమారచెట్టి గ్రామంలో వింతైన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు మహీంద్రా థార్ వాహనంలో నీళ్లు లేని చెరువు మధ్యలోకి వెళ్లి మద్యం సేవించి అక్కడే నిద్రపోయారు. అర్ధరాత్రి భారీ వర్షం కురియడంతో చెరువులోకి వరద నీరు వచ్చి కారు సగానికి పైగా మునిగిపోయింది. దీంతో వారు కారు టాప్ పైకి ఎక్కి కేకలు వేయగా, స్థానికులు జేసీబీ సాయంతో తాడుతో వాహనాన్ని, యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.