దిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

రిపోర్టర్: రాము స్థలం: దిల్లీ

దీపావళి పండగ సందర్భంగా దిల్లీ ఎన్ సీ ఆర్ ప్రాంతంలో పర్యావరణహిత బాణాసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నవంబర్ ఏడు, ఎనిమిది తేదీల్ లో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు, అలాగే రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్య మాత్రమే హరిత టపాసులు పేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలకు సమీపంలోని సైలెన్స్ జోన్లలో క్రాకర్స్ పేల్చరాదని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్ లో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.